Ramaiah Health Condition: అతనితో 100 మొక్కలు నాటించండి, ఎలాంటి కేసులు పెట్టవద్దు, నన్ను ఢీకొట్టిన వాహనదారుడికి అదే శిక్ష అంటున్న వనజీవి రామయ్య, నిలకడగా ఆయన ఆరోగ్యం

మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు.

Vanajeevi Ramaiah (Photo-Twitter)

Hyd, May 20: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయిన సంగతి విదితమే. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్‌ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రెడ్డిపల్లి వద్ద రామయ్యను (Vanajeevi Ramaiah) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు (Vanajeevi Ramaiah Injured in Road Accident) గాయాలయ్యాయి. వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇక తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామయ్యను (Padma Sri Vanajeevi Ramaiah) మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రామయ్య పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. రామయ్యను పరామర్శించిన వారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు ఉన్నారు.