Vanajeevi Ramaiah (Photo-Twitter)

ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్‌ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను (Vanajeevi Ramaiah) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు (Vanajeevi Ramaiah Injured in Road Accident) గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో రామయ్యకి జరిగిన రెండో రోడ్డు ప్రమాదం ఇది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో రామయ్యకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు.

ఇప్పటికే వనజీవి రామయ్య అనారోగ్యంగా ఉన్నాడు. కాలికి గాయమైంది. కాలికి సర్జరీ చేయాలని కూడా వైద్యులు సూచించారు. ఈ తరుణంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. 2019 మార్చిలో వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక, రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం, అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

మొక్కల పెంపకంపై రామయ్య ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు. దీంతో ఆయనను వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు.మొక్కల పెంపకం కోసం రామయ్య చేస్తున్న కృషికి గాను రామయ్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది ప్రభుత్వం.వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో రకరకాల గింజలు సేకరిస్తారు. వర్షాకాలంలో వీటిని రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నాటుతారు. 2017లో రామయ్యకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. సుమారు 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య చెబుతారు. రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది.

ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి రామయ్య స్వగ్రామం. రామయ్య ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. మత్తగూడెం స్కూల్లో టీచర్ మల్లేషం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు రామయ్య జీవితాన్ని ప్రభావితం చేశాయి. తొలుత తన ఇంట్లో మొక్కలను పెంచాడు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ స్థలం కన్సిస్తే అక్కడ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. కుండలు చేస్తూ పాలు అమ్మడం ద్వారా పొట్టపోసుకొనేవాడు రామయ్య. తన 15వ ఏటనే రామయ్య కు జానమ్మతో పెళ్లి జరిగింది. వీరికి నలుగురు పిల్లలు