Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డివి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టే పిచ్చి మాట‌లు, ప్రభుత్వం వరదలపై ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయలేదంటూ మండిపడిన హరీష్ రావు

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.గ‌త మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Harish Rao vs Revanth Reddy (photo-File image)

Hyd, Sep 3: ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గ‌త మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు ఖ‌మ్మం జిల్లాలో తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగింది.

సూర్యాపేట‌, ఖ‌మ్మం, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో వ‌ర్షాల వ‌ల్ల జ‌న‌జీన‌వం అత‌లాకుల‌త‌మైంది. భారీగా ప్రాణ, ఆస్తి, పంట న‌ష్టం జ‌రిగింది. వ‌ర‌ద‌ల విష‌యంలో ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌ల‌మైంది. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్ల, ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రాణ, ఆస్తి న‌ష్టం పెద్ద ఎత్తున జ‌రిగిందన్నారు.  భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పనితనం తక్కువ అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మంది ప్రాణాలు కూడా కాపాడలేకపోయారు. పాల‌న‌పై రేవంత్ రెడ్డి ప‌ట్టు కోల్పోయారు. చీటిమాటికి ప్ర‌తిప‌క్షాల‌పై బుర‌ద జ‌ల్లుతున్నారు. ఇంకా మొద్దు నిద్ర నుంచి మేల్కొన‌లేదు.  ప్రాణ‌, ఆస్తి న‌ష్టం భారీగా జ‌రిగింది. దాదాపు ఒక్కో కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగిందన్నారు.

క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌ప‌డ్డామ‌ని వ‌ర‌ద బాధితులు ఆవేద‌న చెందుతున్నారు. స‌ర్టిఫికెట్లు, బియ్యం, నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌డిసిపోయాయ‌ని క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌ బంగారం కొట్టుకుపోయిందంటున్నారు. 12 గంట‌ల పాటు తాగ‌డానికి నీళ్లు లేక విల‌విల‌లాడిపోయార‌ట‌. రెండు రోజుల నుంచి తిన‌డానికి తిండి లేద‌ని బాధ‌ప‌డుతున్నారు. ఇది పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Here's Videos

చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఇదే రేవంత్, సీత‌క్క ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అడిగారు. ఆ మాట ప్ర‌కారం త‌క్ష‌ణ‌మే చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. మాట మీద నిల‌బ‌డాల‌ని డిమాండ్ చేస్తున్నాం. వ‌ర‌ద‌లో పూర్తిగా మునిగిన ఇండ్ల‌కు త‌క్ష‌ణ‌మే రూ. 2 ల‌క్ష‌లు సాయం చేయాల‌ని కోరుతున్నాం. మీరు ఇచ్చే రూ. ప‌ది వేలు ఏ మూల‌కు స‌రిపోవు.. ద‌య‌చేసి ఆదుకోండి.

పిల్ల‌ల స‌ర్టిఫికెట్లు త‌డిసి ముద్ద‌య్యాయి.వారంద‌రికి ఉచితంగా స‌ర్టిఫికెట్లు అంద‌జేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. బియ్యం ఇచ్చినా వండుకొనే ప‌రిస్థితి లేద‌న్నారు. ఇంట్లో బుర‌ద ఉన్నాక ఎలా వండుకుంటామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దివాళాకోరు ప్ర‌భుత్వం ఇది. రేవంత్ రెడ్డికి వ్యంగం ఎక్కువ.. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టి పిచ్చి మాట‌లు మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో కేంద్రం కూడా విఫ‌ల‌మైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను, హెలికాప్ట‌ర్ల‌ను పంప‌లేక‌పోయింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌డంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయి. సీఎంను డిమాండ్ చేస్తున్నాం.. అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకీ తీసుకెళ్లాలి. మోదీని నిల‌దీద్దాం.. స‌హాయం ఎందుకు చేయ‌రో అడుగుదాం. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యానికి ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల ప్ర‌జ‌లు బ‌ల‌య్యారని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు చ‌నిపోయిన వారి విష‌యంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. చ‌నిపోయిన వారి విష‌యంలో సంఖ్య త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి 16 మంది చ‌నిపోయిన‌ట్టు చెప్పారు. కానీ మా వ‌ద్ద స్ప‌ష్టంగా వివ‌రాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాల‌కు, వ‌ర‌ద‌ల‌కు 30 మంది చ‌నిపోయిన వారి వివ‌రాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 11 మంది, మ‌హ‌బూబాబాద్‌లో 3, సూర్యాపేట‌లో ఇద్ద‌రు, , ములుగులో ఇద్ద‌రు, ఆదిలాబాద్‌లో ఒక్క‌రు, నారాయ‌ణ‌పేట‌లో ఇద్ద‌రు, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో గుర్తు తెలియ‌ని డెడ్ బాడీ దొరికింది. వ‌న‌ప‌ర్తిలో ఒక‌రు, పెద్ద‌ప‌ల్లిలో ఇద్ద‌రు, కామారెడ్డిలో ఒక‌రు, సిద్దిపేట‌లో ఇద్ద‌రు, రంగారెడ్డిలో ఇద్ద‌రు చ‌నిపోయారు. ప్ర‌భుత్వం ఏమో 16 మంది అని చెబుతున్నారు. మ‌ర‌ణాల విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

భ‌క్త‌రామ‌దాసు, పాల‌మూరు ఎత్తిపోత‌ల పంప్ హౌస్‌లు నీట మునిగాయి. దీనికి పూర్తిగా ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణం. 2 వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగింది. ప్ర‌భుత్వ యంత్రాంగం స‌కాలంలో స్పందించి ఉంటే వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగి ఉండ‌క‌పోయేది. న‌ష్ట‌పోయిన పంట‌కు ఎక‌రానికి రూ. 30 వేలు ఇవ్వాల‌ని గ‌తంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్ర‌తి ఎక‌రాకు రూ. 30 వేలు ఇచ్చి రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాం. మీ త‌ప్పిదం వ‌ల్ల సాగ‌ర్ కెనాల్ తెగిపోయింది. రైతులు బాధ‌ప‌డుతున్నారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

అన్ని మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు ఇంటింటికి పోయి కాగితాలు జమచేసి తెచ్చి ఇవ్వాలంటాడు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే కేసీఆర్ వెళ్లి ఢిల్లీలో దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సహాయం చేయండి అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. అన్ని మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్