KTR Slams CM Revanth Reddy: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న

ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు.

KTR and Revanth Reddy (photo-X)

Hyd, August 15: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు. తమది కుటుంబ పాలన అని విమర్శించారని... ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి సోదరులే కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసిందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ బావమరిది కంపెనీకి రూ. 1,000 కోట్ల టెండర్ ఇచ్చారని ఆరోపించారు. మాయ మాటలతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని చెప్పారు. కడియం కావ్యను, కడియం శ్రీహరిని ప్రజలు త్వరలోనే నిలదీస్తారని అన్నారు.  బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు

బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన ఖర్మ తమకు లేదని కేటీఆర్ చెప్పారు. బీజేపీతో తమకు ఒప్పందాలు ఉంటే కవిత ఇన్ని రోజులు జైల్లో ఉంటుందా? అని ప్రశ్నించారు. హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు చేస్తామని అన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని... బీసీ రిజర్వేషన్లను పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని విమర్శించారు.



సంబంధిత వార్తలు

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Student Suicide: హైద‌రాబాద్‌ మియాపూర్ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజ‌య‌వాడ‌