Revanth Reddy vs Talasani: నేనే వస్తా, ఏం పిసుకుతావో పిసుకు, మంత్రి తలసానికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి, అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్‌ నమిలేటోడు అంటూ వ్యాఖ్యలు

దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Revanth Reddy vs Talasani (Photo-File Image)

Hyd, May 11: ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుందని రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలాకాలం దున్నపోతులతో తిరిగి వాటి పెండ పిసికే అలవాటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనను పిసికేస్తానంటూ ప్రగ ల్భాలు పలకడం హాస్యాస్పదమని అన్నారు.

ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఆయినా ఆయన ఏం పిసకాలనుకుంటున్నాడో సమయం చెబితే తాను వస్తానని చెప్పారు. అప్పుడు పిసికి చూపించాలని సవాల్ విసిరారు. తలసాని ఎన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ కాళ్లు పిసికినా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడినైన తన స్థాయికి రాలేడని వ్యాఖ్యానించారు.

గచ్చిబౌలి-కొండాపూర్‌ మార్గంలో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు, కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు

అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్‌ నమిలేటోడు కూడా తన గురించి మాట్లాడితే గౌరవంగా ఉండదని రేవంత్‌ అన్నారు. తలసాని పాన్‌పరాగ్‌ మానేస్తే బాగుంటుందని, ప్రజాప్రతినిధులుగా మనం యువకులకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.



సంబంధిత వార్తలు