File Image (Credits: Hyderabad Traffic FB Page)

Hyderabad, May 11: హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మూడు నెలల పాటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ జంక్షన్ (ORR) నుండి కొండాపూర్ (Kondapur) వైపు నూతన ప్లై ఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలు పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic police) తెలిపారు. ఈనెల 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ రహదారిలో ఎలాంటి వాహనాలు అమతించడం జరగదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలకు వెళ్లేవారు ఇతర రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

– ఔటర్ రింగ్ నుంచి కొత్తగూడ వైపు వెళ్లే ట్రాఫిక్ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా మీనాక్షి డెలాయిట్ మీదుగా రాడిసన్ హోటల్, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లవచ్చు.

– లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్, డీఎల్ఎఫ్, రాడిసన్ హోటల్ నుంచి వెళ్లొచ్చు.

– విప్రో జంక్షన్ నుంచి అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్ గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్ తీసుకొని డీఎల్ఎఫ్ మీదుగా వెళ్లాలి.

– టోలిచౌకీ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డుకు వెళ్లే ట్రాఫిక్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్ అండర్ పాస్, సైబర్ టవర్, శిల్పారామం మీదుగా వెళ్లాలి.

Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలు సేఫ్‌, తుఫాన్ ప్రభావం లేదని వాతావరణశాఖ ప్రకటన, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం, ఒడిషా, బెంగాల్‌పై మాత్రం మోచా ఎఫెక్ట్  

– టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి ప్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని శిల్పా లే అవుట్ ప్లై ఓవర్ ర్యాంప్ పై నుంచి డెలాయిట్ రోడ్డులో వెళ్లాలి.

– అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనాలను బొటానికల్ గార్డెన్ వద్ద మసీద్ బండ వైపు మళ్లిస్తారు. అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.