TSRTC: ప్రయాణికులకు అలర్ట్, హైదరాబాద్ - విజయవాడ బస్సు సర్వీసులు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ, ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం

ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది.

VC Sajjanar (Photo-Twitter)

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది. విజయవాడ - హైదరాబాద్ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే రెగ్యులర్ బస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ - విజయవాడ హైవే మీద 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, మిర్యాలగూడ మీదుగా మళ్లింపు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు వాగు

సజ్జనార్ ట్వీట్ మేరకు.. హైదరాబాద్ - విజయవాడ మధ్య రెగ్యులర్ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Here's Sajjanar tweet

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల్లో గంల్లంతైన పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఈ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Here's Flood Video

ముఖ్యంగా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల పైచిలుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

గోదావరికి నదికి అంతకంతకూ పెరుగుతున్న వరద, అలర్ట్ అయిన అధికారులు, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

అలాగే, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.