Bhadrachalam, July 28: గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. అలాగే ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా గోదావరి నదికి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది.
అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం వాజేడు మండలాలలో కూడా రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. గోదావరి వరదల కారణంగా టేకులగూడెం, వీరభద్రవరం , సుర వీడు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గోదావరి కి కొనసాగుతున్న వరద ఉధృతితో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గోదావరి కి కొనసాగుతున్న వరద ఉధృతి భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.5 అడుగుల వద్ద కొనసాగుతుందని, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 13.57 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని పేర్కొంది. గోదావరి వరదల వల్ల ప్రభావితమయ్యే జిల్లాలలో 42 మండలాలు 458 గ్రామాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించింది.
పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఇంకా గోదావరిలో ఇంకా ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. అన్నదాన సంత్రంలోకి వాన నీరు వచ్చింది. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. గంటలు గడిచే కొద్ది నదిలో ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.