Telangana Coronavirus: తెలంగాణలో తాజాగా 1256 కరోనా పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 80 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 637కు పెరిగిన మరణాల సంఖ్య

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కు ( covid 19 cases) చేరుకుంది. కోవిడ్-19 నుంచి కొత్తగా 1,587 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586గా ఉంది. కరోనాతో గత 24 గంటల్లో మరో 10 మంది మృతి (new covid 19 Deaths) చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, August 10: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కు ( covid 19 cases) చేరుకుంది. కోవిడ్-19 నుంచి కొత్తగా 1,587 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586గా ఉంది. కరోనాతో గత 24 గంటల్లో మరో 10 మంది మృతి (new covid 19 Deaths) చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది.

ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386

తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారీన పడ్డారు. తాజాగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నారు.కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి

ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు. తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ అని శనివారం అర్ధరాత్రి తెలిసిందని, కోడలు, గన్‌మన్, డ్రైవర్‌కు నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య

ఇదిలా ఉంటే మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య(78) శనివారం కరోనాతో కన్నుమూశారు. గత నెల 29న అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఎల్లయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.



సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం