COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Hyderabad, July 1:  తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజుకో వెయ్యి చొప్పున పెరుగుతూ పోతుంది. గత 24 గంటల్లో తెలంగాణలో మరో 1018 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 17,357కి చేరుకుంది.

హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తుంది. బుధవారం నమోదైన కేసుల్లో కూడా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 881 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరుసగా 36 మరియు 33 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మహబూబ్ నగర్ 10, మంచిర్యాల, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి చెరో 9 కేసుల చొప్పున రికార్డ్ అయ్యాయి. తెలంగాణలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం,  ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఈరోజు మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 267 కు పెరిగింది.

ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో మరో 788 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 8,082మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 4,234 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 92,797 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.



సంబంధిత వార్తలు

CM Revanth reddy Speech: ప‌దేళ్ల‌లో రాష్ట్ర సంప‌ద గుప్పెడు మందికి చేరింది, త‌ప్పులు జ‌రిగితే స‌రిదిద్దుకొని, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్తాం

Telangana Formation Day 2024 Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ ఫోటో గ్రీటింగ్స్, మెసేజెస్ మీకోసం

Telangana Formation Day Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మ‌తిలేని వ్యాఖ్య‌లు, ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కేసీఆర్ రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు

Telangana State Formation Day 2024 Telugu Wishes: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలిజయేండిలా..

2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

Hyderabad Shocker: ప్రేమలో మోసపోయానంటూ యువతి ఆత్మహత్య, మీ మాట వింటే సంతోషంగా ఉండేదాన్నంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ