Corona in Telangana: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కొవిడ్?, రాష్ట్రంలో 46 వేలకు పైగా నమోదైన కేసుల్లో 34 వేలకు పైగా రోగులు రికవరీ, కొత్తగా మరో 1198 పాజిటివ్ కేసులు నమోదు,
ఈరోజు వరంగల్ అర్బన్ నుంచే 73 కేసులు రాగా, ఒక్క కరీంనగర్ నుంచే 86 కేసులు నమోదయ్యాయి. అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇటీవల కాలంలోనే అత్యధికంగా...
Hyderabad, July 20: తెలంగాణలో కొవిడ్19 తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రతిరోజు నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఒకరోజులో వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ పోతుండగా, ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1198 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 46,274కి చేరుకుంది.
గత కొంతకాలంగా కనీసం వెయ్యికి పైగా నమోదయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం ఒకరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య సగానికి తగ్గింది. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 510 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 106 కేసులు, మేడ్చల్ నుంచి 76, సంగారెడ్డి నుంచి 10 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
ఇక ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల కాలంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు వరంగల్ అర్బన్ నుంచే 73 కేసులు రాగా, ఒక్క కరీంనగర్ నుంచే 86 కేసులు నమోదయ్యాయి. అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇటీవల కాలంలోనే అత్యధికంగా ఈరోజు 50 పాజిటివ్ కేసులు వచ్చాయి.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 422 కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1885 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 32,323 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,530 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 11,003 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,76,222 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.