COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1284 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 43,780కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 409కి పెరిగిన కరోనా మరణాలు

శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 667 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 68 కేసులు, మేడ్చల్ నుంచి 62, సంగారెడ్డి నుంచి 86 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి...

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, July 18:  తెలంగాణలో కొవిడ్19 తీవ్రత కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నట్లుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించే గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే గత రెండు,మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1284 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 43,780 కి చేరుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 667 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 68 కేసులు, మేడ్చల్ నుంచి 62, సంగారెడ్డి నుంచి 86 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య తగ్గుకుంటే పోతే, పల్లు జిల్లాల్లో ఇందుకు విరుద్ధంగా రోజురోజుకి వచ్చే పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు కరీంనగర్‌లో 58, నల్లగొండలో 46, వరంగల్ అర్బన్ నుంచి 37, వికారాబాద్ జిల్లా నుంచి 35 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి.

Telangana's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

శనివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 409 కు పెరిగింది.

అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1902 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 30,607 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,765 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  14,883 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,52,700 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.