COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1554 పాజిటివ్ కేసులు నమోదు, 50 వేలకు చేరువైన కొవిడ్19 బాధితుల సంఖ్య, రాష్ట్రంలో 438కి పెరిగిన కరోనా మరణాలు

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు కరోనావైరస్ హాట్ స్పాట్ గా మారుతున్నాయి. కరీంనగర్ లో ఈరోజు మరో 73 కేసులు బయటపడ్డాయి...

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, July 22:  తెలంగాణలో కొవిడ్19 కేసులు గతంలో కంటే కొంత మేర తక్కువగానే నమోదవుతున్నా, వైరస్ వ్యాప్తి మాత్రం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1554 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 49,259 కి చేరుకుంది.

బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 842 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 132 కేసులు, మేడ్చల్ నుంచి 96, సంగారెడ్డి నుంచి 24 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

ఇక జిల్లాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు కరోనావైరస్ హాట్ స్పాట్ గా మారుతున్నాయి. కరీంనగర్ లో ఈరోజు మరో 73 కేసులు బయటపడ్డాయి. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలో ఇవాళ 38  పాజిటివ్ కేసులు నమోదు కాగా,  వరంగల్ రూరల్ నుంచి కూడా 36 కేసులు నిర్ధారించబడ్డాయి.  నల్గొండలో 51  మందికి కరోనా సోకినట్లు తేలింది.

TS's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 438 కు పెరిగింది.

అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 1281 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 37,666 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  15,882 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,08,959 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు