COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 1640 పాజిటివ్ కేసులు, పలు జిల్లాల నుంచి వందకు పైగానే నమోదైన కొవిడ్ కేసులు, రాష్ట్రంలో 450 దాటిన కరోనా మరణాలు

ఈరోజు కరీంనగర్ నుంచి 100 కేసులు రాగా, పెద్దపల్లి నుంచి 98, సిరిసిల్ల నుంచి 20, జగిత్యాల నుంచి 17, మంచిర్యాల నుంచి 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే చుట్టూరా కేసులు పెరుగుతూ పోతున్నా గత కొంతకాలంగా నిర్మల్ జిల్లా నుంచి 1 కేసు మాత్రమే నమోదవుతుండటం గమనార్హం....

COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Hyderabad, July 24:  తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటి జిల్లాల నుంచి కూడా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం  కలవరపెడుతోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1640 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో  రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 52,466 కి చేరుకుంది.

శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 683 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 30 కేసులు వచ్చాయి.  ఈరోజు 3 జిల్లాల నుంచి 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలను కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. రంగారెడ్డి నుంచి 135, సంగారెడ్డి నుంచి 102 కేసులు వచ్చాయి. ఇక కరీంనగర్ జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈరోజు కరీంనగర్ నుంచి 100 కేసులు రాగా, పెద్దపల్లి నుంచి 98, సిరిసిల్ల నుంచి 20, జగిత్యాల నుంచి 17, మంచిర్యాల నుంచి 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే చుట్టూరా కేసులు పెరుగుతూ పోతున్నా గత కొంతకాలంగా నిర్మల్ జిల్లా నుంచి 1 కేసు మాత్రమే నమోదవుతుండటం గమనార్హం.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 455 కు పెరిగింది. సౌత్ ఇండియాలోని మూడు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొవిడ్-19 కేసులు

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1007 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 40,334 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  15,445 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,37,771 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.