COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 1708 పాజిటివ్ కేసులు మరియు 5 కొవిడ్ మరణాలు నమోదు, హెల్త్ బులెటిన్ గణాంకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1233కు పెరిగింది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ చూపుతున్న కొవిడ్ మరణాల పట్ల హైకోర్ట్ అనుమానాలు వ్యక్తం చేసింది. మరణాలు దాస్తున్నారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది...

Coronavirus in TS (Photo Credits: IANS)

Hyderabad, October 13:  వారాంతంలో టెస్టుల సంఖ్య తగ్గించిన నేపథ్యంలో నిన్న తగ్గిన పాజిటివ్ కేసులు నేడు మళ్లీ పెరిగాయి.  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 46,835 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1708 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1034 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,24,096 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,14,792కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 277 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి మరియు మేడ్చల్ పరిధుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. రంగారెడ్డి నుంచి 137, మేడ్చల్ నుంచి 124 కేసులు నిర్ధారణయ్యాయి.

ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల కేసుల విషయానికి వస్తే నిన్న ఎక్కువగా కొత్తగూడెం నుంచి 97, కరీంనగర్ నుంచి 86, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల నుంచి చెరి 81 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

ఇక, సోమవారం సాయంత్రం వరకు మరో 2009 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,89,351 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 24,208 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

మరోవైపు గత 24 గంటల్లో మరో 5 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1233కు పెరిగింది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ చూపుతున్న కొవిడ్ మరణాల పట్ల హైకోర్ట్ అనుమానాలు వ్యక్తం చేసింది. మరణాలు దాస్తున్నారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. పరీక్షల సంఖ్య అతి తక్కువగా 300 చేసినప్పుడు, అలాగే ఎక్కువగా 60 వేల పరీక్షలు చేసినపుడు కూడా రాష్ట్ర హెల్త్ బులెటిన్ ఒకే విధమైన గణాంకాలు చూపడంపై హైకోర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.