Corona in Telangana: కొత్తగా 2,216 మందికి కరోనా, 1,57,096 కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 11 మంది మృతితో 961 కి చేరిన మరణాల సంఖ్య
కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య (Telangana Coronavirus) 1,57,096 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి (Covid Deaths) చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Hyderabad, Sep 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు( Corona in Telangana) నమోదవుతున్నాయి. కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య (Telangana Coronavirus) 1,57,096 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి (Covid Deaths) చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,24,528 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 341, రంగారెడ్డి జిల్లాలో 210 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆర్టీసీకి గుదిబండగా మారి, నష్టాలు మూటగట్టిన వజ్ర మినీ బస్సులు కోవిడ్ పరీక్షల విషయంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఇటీవల 3 వజ్ర ఏసీ బస్సులను కోవిడ్ సంచార పరీక్షాకేంద్రాలుగా మార్చారు. వాటిని రవాణామంత్రి పువ్వాడ అజయ్ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. నిత్యం ఈ బస్సుల ద్వారా దాదాపు 750 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనివ్వడంతో మిగతా బస్సులను కూడా సం చార ల్యాబ్‌లుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది.