Covid In Telangana: తెలంగాణలో తాజాగా 993 మందికి కరోనా, 2,66,042కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నలుగురు మృతితో 1,150కు చేరుకున్న మరణాల సంఖ్య

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి Covid In TS) చేరింది. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోగా, అదే సమయంలో 1,150 మంది కోలుకున్నారు.

Coronavirus in India (Photo Credits: PTI)

Hyd, Nov 25: తెలంగాణలో గత 24 గంటల్లో 993 కరోనా కేసులు (Covid In Telangana) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి Covid In TS) చేరింది. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోగా, అదే సమయంలో 1,150 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు మొత్తం 2,53,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,441కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,594 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి.

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు (Covid Cases in India) వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 37,816 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోవిడ్‌ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,42,771కు చేరింది. కాగా కొత్తగా 481 కోవిడ్‌ మరణాలు సంభవించడంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,34,699కు (Covid Deaths in India) చేరుకుంది.

కరోనా రోగుల్ని గుర్తిస్తున్న శునకాలు, ఢిల్లీలో ఆగని కరోనా కల్లోలం, రష్యా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై కొత్త ఆశలు, దేశంలో 92 లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 44,376 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు

దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు (Delhi Coronavirus) నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరింది. గడచిన 24 గంటల్లో 4,943 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 4,93,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు.



సంబంధిత వార్తలు

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

Mosquito-Borne Disease: ఢిల్లీలో పెరుగుతున్న చికున్‌గున్యా, మలేరియా కేసులు, గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు