COVID in Telangana: తెలంగాణలో తొలిసారిగా ఒక్కరోజులోనే వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 13 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 243కు పెరిగిన కరోనా మరణాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 79,231 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది....

COVID19 Outbreak in India | (photo-PTI)

Hyderabad, June 28: తెలంగాణలో కరోనావైరస్ దాని తడాఖా చూపిస్తుంది. తొలిసారిగా రాష్ట్రంలో ఒక్కరోజులోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 13,436 కు చేరుకుంది.

ఎప్పట్లాగే అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. శనివారం  నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ నుంచే 888 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.

నిన్న రంగారెడ్డి జిల్లా  నుంచి 74, మేడ్చల్ నుంచి 37 పాజిటివ్  కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లా నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా 35 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Update:

Status of positive cases of #COVID19 in Telangana

 

నిన్న మరో 6 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 243 కు పెరిగింది.

ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో మరో 162 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,928 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,265 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,923 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 79,231 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Student Suicide: హైద‌రాబాద్‌ మియాపూర్ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజ‌య‌వాడ‌

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత