TS's COVID Update: తెలంగాణలో మరల ఒకేరోజులో 879 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 9.5 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య , 220కి పెరిగిన కరోనా మరణాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 63,249 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది....

Corona in Hyderabad (photo-Youtube grab)

Hyderabad, June 24:  తెలంగాణలో రోజురోజుకు తీవ్రస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా మరోసారి ఆదివారం వచ్చిన కేసులతో దాదాపు సరిసమానంగా 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 9,553 కు చేరుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ కరోనావైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది.   సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 652 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత మేడ్చల్ నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా 112 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా 64 పాజిటివ్ కేసులు  నిర్ధారణ అయ్యాయి.

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID19 Update:

 

Status of positive cases of #COVID19 in Telangana

 

నిన్న మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 220 కు పెరిగింది.

ఇదిలా ఉంటే, ఈరోజు మరో 219 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,224 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,109 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,006 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,249 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif