Indian Wins Dubai Lottery: తెలంగాణవాసికి దుబాయ్ బంపర్ లాటరీ, రూ. 300 వందలు పెట్టి కొంటే రూ. 33 కోట్లు, నక్కతోక తొక్కిన జగిత్యాలవాసి
తీరా 15 మిలియన్ దిర్హామ్స్ (మన కరెన్సీలో దాదాపు రూ.33.8 కోట్లు) గెలుచుకున్నట్లు తెలియగానే అంతులేని సంతోషానికి గురయ్యాడు. క్రిస్మస్ (Christamas) సందర్భంగా జరిగిన మెగా డ్రాలో అజయ్ భారీ మొత్తం గెలిచాడు. ఈ సందర్భంగా లాటరీ అందుకున్న అజయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Dubai, DEC 23: అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. కొంతమంది తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తుతారు. లాటరీల్లో కోట్లు గెలుచుకుంటారు. తాజాగా ఒక వ్యక్తి దుబాయ్‌లో రూ.33 కోట్ల భారీ లాటరీ గెలుచుకున్నాడు. అది కూడా రూ.338 పెట్టి కొన్న టిక్కెట్టుపై ఇంత మొత్తం గెలవడం విశేషం. తెలంగాణ, జగిత్యాల జిల్లా(Jagityal), తుగూరుకు చెందిన అజయ్ ఓగుల (Ajay Ogula) నాలుగేళ్ల క్రితం దుబాయ్ (Dubai) వెళ్లాడు. అక్కడ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, అతడు తరచూ లాటరీ (Lottery) టిక్కెట్లు కొంటుంటాడు. తాజాగా 15 దిర్హామ్స్‌కు ఒక్క టిక్కెట్ చొప్పున, 30 దిర్హామ్స్ పెట్టి రెండు లాటరీ టిక్కెట్లు కొన్నాడు. వాటిలో ఒక దానికి రూ.33.8 కోట్ల విలువైన లాటరీ తగిలింది. శుక్రవారం తీసిన డ్రాలో అజయ్ ఈ మొత్తం గెలుపొందాడు.
దీనికి సంబంధించి మెయిల్ అందుకున్న అజయ్ ముందుగా తాను స్వల్ప మొత్తమే గెలుచుకుని ఉంటానని భావించాడు. తీరా 15 మిలియన్ దిర్హామ్స్ (మన కరెన్సీలో దాదాపు రూ.33.8 కోట్లు) గెలుచుకున్నట్లు తెలియగానే అంతులేని సంతోషానికి గురయ్యాడు. క్రిస్మస్ (Christamas) సందర్భంగా జరిగిన మెగా డ్రాలో అజయ్ భారీ మొత్తం గెలిచాడు. ఈ సందర్భంగా లాటరీ అందుకున్న అజయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తాను చాలా పేద కుటుంబానికి చెందిన వాడినని, సొంత ఇల్లు కూడా లేదని చెప్పాడు. ఇప్పుడు తన తల్లికి, సోదరికి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ముందుగా తన కుటుంబ సభ్యుల్ని దుబాయ్ టూర్ తీసుకొస్తానని చెప్పాడు. గెలుచుకున్న మొత్తాన్ని అతడికి ఒకేసారి ఇవ్వరు. వాయిదాల పద్ధతిలో కొంత మొత్తం చెల్లిస్తూ ఉంటారు. ఎమిరేట్స్ డ్రా లాటరీ అక్కడ నిరంతరం జరగుతుంటుంది. ప్రతి శుక్రవారం సాధారణ డ్రా ఉంటుంది. అయితే, మెగా డ్రా కింద 15 మిలియన్ దిర్హామ్స్ అందిస్తారు. ప్రతి ఆదివారం జరిగే డ్రాలో 10,000 దిర్హామ్స్ నుంచి 77,000 దిర్హామ్స్ వరకు గెలుచుకోవచ్చు. అలాగే జాక్‌పాట్ డ్రా 100 మిలియన్లకు ఉంటుంది. కానీ, క్రిస్మస్ సందర్భంగా దీన్ని 160 మిలియన్ దిర్హామ్స్‌కు పెంచారు.