Telangana: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు.
Hyd, Mar 2: తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Telangana Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు (Orange travels) చెందిన బస్సు.. అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న కారును (Orange Travels Bus Collided With Car In Choutuppal) ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సులో ఉన్న పది మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికు తరలించారు. ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.