Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం, ఐసీయూలోని పేషెంట్‌పై ఎలుకలు దాడి, పేషంట్ పరిస్థితి విషమం, ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (Warangal MGM hospital) ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్‌పై ఎలుకలు దాడి (Rodents bite patient) చేశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమారంకు చెందిన పేషంట్ శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేసి ఐదు చోట్ల కొరికాయి.

Rodents bite patient, leave him bleeding, at Warangal MGM hospital; probe ordered(Photo-Video Grab)

Warangal, Mar 31: ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (Warangal MGM hospital) ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్‌పై ఎలుకలు దాడి (Rodents bite patient) చేశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమారంకు చెందిన పేషంట్ శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేసి ఐదు చోట్ల కొరికాయి. కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు (leave him bleeding) కావడంతో పేషంట్ పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ ఆస్పత్రిని సందర్శించి ఎలుకల బెడదకు గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ, పారిశుద్ద్య పనులను మెరుగుపర్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడి, ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి కన్నడిగులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

బీమారానికి చెందిన శ్రీనివాస్‌కు కిడ్నీజబ్బు చేయడంతో వారంక్రితం ఎంజీఎంలో చేరారు. అయితే ఈ క్రమంలో ఎలుకలు శ్రీనివాస్‌ వేళ్లను కొరుక్కుతిన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్‌ను ఎలుకలు తీవ్రంగా గాయపరిచిన ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు సీరియస్‌ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. ఇప్పటికే అడిషనల్‌ కలెక్టర్‌ వార్డును పరిశీలించారు. సాయంత్రంలోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.