Tension erupts Srisailam (Photo-Video Grab)

Srisailam, Mar 31: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత (Tension erupts at midnight) చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో స్థానికులు, కర్ణాటక వాసల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం దాడికి (local hotel vendor attacks Karnataka resident) దారితీసింది. చాయ్‌ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఈ క్రమంలో స్థానికులు కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, శ్రీశైలంలో కర్నాటకవాసిపై దాడి చేయడం జీర్ణించుకోని కన్నడిలు ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి నిప్పటించారు. ఈ క‍్రమంలో ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఈఓ లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ, ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేసిన ఏపీ సీఎం జగన్

కాగా ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇదంతా గమనిస్తున్న తోటి కర్ణాటక భక్తులు ఆలయ సరిసరాల్లోని షాపులను ధ్వంసం చేశారు. షాపుల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకున్నారు. శ్రీశైలం వీధుల్లో పెద్దసంఖ్యలో పోలీసును మోహరించారు. గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణాలపై దాడులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.