Hyderabad Violence: హైదరాబాద్ శివార్లలో 144 సెక్షన్ అమల్లోకి, రోడ్డు వేస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులతో పలువురికి గాయాలు
కమీషనర్ అవినాష్ మొహంతి.. సెక్షన్ 144 Cr.PC కింద (Section 144 Imposed Prohibitory ) ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విధించారు.
Hyd, Feb 15: హైదరాబాద్ శివార్లలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు విధించారు. కమీషనర్ అవినాష్ మొహంతి.. సెక్షన్ 144 Cr.PC కింద (Section 144 Imposed Prohibitory ) ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విధించారు. బయటి వ్యక్తులను ఆ ప్రాంతంలోకి అనుమతించరు.ఫిబ్రవరి 21 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ప్రజల ప్రాణాలకు, భద్రతకు హాని కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
శంకరపల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో ఘర్షణలు (Clash Between Communities) జరిగిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. అల్లర్లలో వ్యక్తులకు గాయాలతో పాటు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై మోకిలా పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదైనట్లు పోలీసు స్టేషన్‌లో తెలిపారు.ఇదిలావుండగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించేందుకు బీఎస్పీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం గ్రామాన్ని సందర్శించినప్పుడు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్, ఆటోల బంద్.. హైదరాబాద్ లో భారీ ర్యాలీ.. ఎందుకంటే??
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మంగళవారం సాయంత్రం హెచ్ఎండీఏ నిధులతో చర్చి ముందు రోడ్డు వేస్తున్నారు. కొద్దిగా స్థలం వదిలిపెట్టి రోడ్డు వేయాలని ఓ వర్గం కోరారు. స్థలం వదిలిపెట్టకుండా రోడ్డు వేస్తామని మరో వర్గం వారు చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం, దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందడంతో మోకిల పోలీసులు గ్రామానికి వెళ్లారు. గొడవ సద్దుమణగకపోగా అదనపు బలగాలను రప్పించారు.
హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్ లో దొంగతనం.. వీడియో ఇదిగో!
రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, నార్సింగి ఏసీపీ లక్ష్మినారాయణ, మోకిల, శంకర్ పల్లి, నార్సింగి సీఐ లు వీరబాబు, వినాయక్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి సముదాయించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జన్వాడలో దళితులపై జరిగిన దాడి హేయమైన చర్య బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన నిందితులను గుర్తించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.