Police Sexual Harassment: ఒక్కసారి కోరిక తీరిస్తే వదిలేస్తా, నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ మహిళను బెదిరించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు
మహిళను లైంగికంగా వేధించిన ఘటనలో సస్పెన్షన్‌కు గురైన స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కె.చంద్రకుమార్ బాధితురాలితో అత్యంత హేయంగా ప్రవర్తించాడని తెలుస్తోంది.
Hyderabad, August 20: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఓ పోలీస్ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది. మహిళను లైంగికంగా వేధించిన ఘటనలో సస్పెన్షన్‌కు గురైన స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కె.చంద్రకుమార్ బాధితురాలితో అత్యంత హేయంగా ప్రవర్తించాడని తెలుస్తోంది.
తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు వాపోతోంది. అంతే కాకుండా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధించాడని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) దర్యాప్తు అధికారులు ఈ వివరాలు పొందుపరిచారు.
ఈ అంశం వివరాల్లోకెళితే.. వనస్థలిపురంలో నివసిస్తున్న బాధితురాలు వరంగల్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూహైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయమైంది. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేసేవాడు. ఐసోలేషన్ వార్డులో లైంగిక దాడి, కరోనా సోకిన మహిళపై మరో కరోనా సోకిన డాక్టర్ అసభ్య ప్రవర్తన
ఆ పరిచయం కొన్నాళ్లపాటు సాగిన తర్వాత ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ను సచివాలయంలో క్లియర్ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత యాచారం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్ బాధితురాలికి తరచూ ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి తన కోరిక తీర్చాలని ఆ తరువాత నీకు ఎటువంటి వేధింపులు ఉండవని బెదిరింపులకు దిగాడు . దీంతో బాధితురాలు అతడిని దూరంగా ఉంచడం మొదలెట్టింది. ఇది సహించని ఇన్‌స్పెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. పిల్లల్నీ హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. బాధితురాలి తండ్రికీ ఫోన్లు చేసి దుర్భాషలాడాడు. కూతురు ఫ్రెండ్‌తో తండ్రి అక్రమ సంబంధం, ఆమెకు పెళ్లి కుదరడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలతో బ్లాక్ మెయిల్
దీంతో బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడు. దీంతో అధికారులు అతడిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత కూడా బుద్ధి మార్చుకోని చంద్రకుమార్ ఆమెకు ఫోన్లు చేస్తూ వేధించాడు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు.
చంద్రకుమార్ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తోపాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకుమార్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మూడు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్ చేశారు. వన స్థలిపురం పోలీసులు అతనిపై నిర్భయ కేసు నమోదు చేశారు. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఎస్బీ సీఐ చంద్రకుమార్‌ను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదై మూడు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.