
Chennai,December 25: కూతురుతో స్నేహం చేసిన ఓ యువతితో ఆ కూతురు తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యకు గురయిన ఘటన తమిళనాడులో(Tamil Nadu) జరిగింది. ఆ యువతికి పెళ్లి సంబంధం కుదరడంతో ఆ 59 ఏళ్ల పెద్ద మనిషి (59-year old father) వారిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలతో ఆ యువతని బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకూడదని నాతోనే ఉండాలని అన్నాడు. అది తట్టుకోలేక ఆ యువతి అతన్ని కత్తితో పొడిచి చంపేసింది. పూర్తి వివరాల్లోకెళితే..
సాత్తుమానగర్ ప్రాంతానికి చెందిన అమ్మన్‌శేఖర్ (54)(Sekar alias Amman Sekar) కర్పూరం వ్యాపారం చేస్తున్నాడు.ఇతని సొంత ఊరు తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లా. కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలి (25)పై అమ్మన్ శేఖర్‌కు లైంగిక వాంఛ కలిగింది. ఈ క్రమంలో యువతికి బహుమతులు ఇస్తూ సన్నిహితంగా మెలిగాడు. అది ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంత కాలంగా ఇద్దరూ పలు చోట్లకు వెళ్లి ఉల్లాసంగా గడిపారు. ఈ క్రమంలో పవిత్రకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు.
ఈ సంగతి తెలుసుకున్నఆ వ్యాపారి యువతితో తీసుకున్న ఆశ్లీల వీడియోలు చూపించి వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు(blackmailing her) దిగాడు. దీంతో ఆగ్రహించిన యువతి చేసేది లేక శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. సోమవారం ఇద్దరూ బెసంట్ నగర్, తదితర ప్రాంతాల్లో ఉల్లాసంగా తిరిగారు. అనంతరం కొత్త చాకలిపేట హార్బర్ క్వార్టర్స్ క్రీడామైనానం వైపు బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో యువతి శేఖర్‌ను బైక్ ఆపమని చెప్పింది. నాకొక గిఫ్ట్ ఇవ్వాలని కోరింది. అతన్ని కళ్లు మూసుకోమని చెప్పడంతో శేఖర్ కళ్లు మూసుకున్నాడు.
ఈ క్రమంలో యువతి మత్తు స్ఫ్రేను అతని ముఖంపై చల్లింది. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచి పారిపోయింది. అమ్మన్ శేఖర్ అదేచోట స్ఫృహతప్పి పడిపోయాడు. తర్వాత కొంత సమయానికే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా యువతిని ఉరి తీయాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ( Stanley Government Medical College Hospital) తరలించారు.