Telangana: బట్టతల ఉన్నా..విగ్గుతో 20 మంది అమ్మాయిల్ని పడేశాడు, వారితో సహజీవనం చేసి డబ్బు, నగలుతో జంప్, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విగ్గు రాజు కార్తీక్‌ వర్మ అలియాస్ షేక్‌ మహ్మద్‌ రఫీ

బట్టతలను కవర్‌ చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని యువకుడు మోసం చేశాడు. తనకు తాను ఎన్నారైగా చెప్పుకుని ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన మహిళలతో సహజీవనం చేసి.. నగదు, నగలు దోచుకుపోతున్న (Bald Head Man Cheats Twenty Women) ప్రబుద్ధుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Bald Head Man Cheats Twenty Women Wearing Wig in Hyderabad (Photo-Twitter/HYD Police)

Hyd, Nov 11: బట్టతలను కవర్‌ చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని యువకుడు మోసం చేశాడు. తనకు తాను ఎన్నారైగా చెప్పుకుని ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన మహిళలతో సహజీవనం చేసి.. నగదు, నగలు దోచుకుపోతున్న (Bald Head Man Cheats Twenty Women) ప్రబుద్ధుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకెళ్తే.. కార్తీక్‌ వర్మ అనే యువకుడు రఫీ పేరుతో సోషల్‌ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అని చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్‌ చేసేవాడు. తనకు వివాహం కాలేదంటూ సోషల్‌ మీడియాలో  విగ్గుతో (Wearing Wig in Hyderabad) ఉన్న ఫొటోలు పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు అతని వల్లో పడ్డారు. వీరితో కొద్దికాలం సన్నిహితంగా ఉండేవాడు.

అనంతరం యువతుల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బయపెడుతూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. అలా  ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. తాజాగా కూకట్‌పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేసుకున్నాడు. కేపీహెచ్‌బీకాలనీకి చెందిన మహిళ(33)కు ఇన్‌స్టాగ్రాంలో కార్తీక్‌వర్మ పేరుతో పరిచయమైన షేక్‌ మహ్మద్‌ రఫీ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి 18.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు స్వాహా చేసి ఉడాయించిన విషయం తెలిసిందే. బాధితురాలు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రఫీని పట్టుకున్నారు. అతడిపై పీడి యాక్ట్‌ నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బట్టతలకు శాశ్వత పరిష్కారం, GAS6 ప్రొటీన్‌ బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచుతుందని తేల్చిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు

రఫీది తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామం. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బాధితురాలితోపాటు మరో నలుగురు మహిళలనూ ఇలాగే నిందితుడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10వ తరగతి వరకు చదువుకున్న రఫీ పాలిటెక్నిక్‌ మధ్యలో వదిలేశాడు. 2010లో నగరానికి చేరుకుని పలుచోట్ల కార్మికుడిగా పనిచేశాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జల్సాలకు అలవాటు పడి భార్యను వేధిస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా గూడూరులో కేసు నమోదైంది. రఫీ మధురానగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు.

Here's Hyderabad City Police Tweet

భార్య నుంచి దూరమైన నిందితుడు జల్సాల కోసం మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో తన పేరు కార్తీక్‌వర్మగా పెట్టుకుని మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. తాను అమెరికాలో పుట్టిన ఎన్నారైగా నమ్మించి మహిళలను వలలో వేసుకునేవాడు. వారితో కొంతకాలం సహజీవనం చేసి తరువాత అసలు స్వరూపం బయటపెట్టేవాడు.

ప్రియుడి కోసం వెళ్లిన ప్రియురాలు, తలుపులేసి ఆమెపై కామవాంఛ తీర్చుకున్న మామ, నిందితుడిని అరెస్ట్ చేసిన చిక్కమగళూరు పోలీసులు

తన అవసరాలకు డబ్బు అవసరమని మహిళల నుంచి అందినంత డబ్బు, నగలు తీసుకుని ఉడాయించేవాడు. కేపీహెచ్‌బీకాలనీకి చెందిన మహిళ ఫిర్యాదుతో నిందితుడి డొంక కదిలింది. నిందితుడికి బట్టతల ఉండగా విగ్గు పెట్టుకుని అందంగా ఫొటోలు పెట్టి మహిళలకు వల వేసేవాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతను విగ్గు (Bald Head Man)పెట్టుకున్నట్లు తెలిసి అవాక్కయ్యారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now