Telangana Shocker: తీవ్ర విషాదం, కరెంట్ షాక్‌తో గ్రామపంచాయితీ వర్కర్ మృతి, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపణ
ఎలక్ట్రిషియన్ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ అమర్చుతుండంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు
Hyd, July 12: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటప్ప విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిషియన్ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ అమర్చుతుండంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామంలో స్తంభాలకు వీధిదీపాలను అమర్చేటప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి.. ఎల్సీ తీసుకున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విద్యుత్ సరఫరా చేయడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై తాండూరు విద్యుత్ శాఖ ఏడి ఆదినారాయణ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ తరపున మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.