IPL Auction 2025 Live

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని సూసైడ్‌ కేసులో కొత్త ట్విస్ట్, డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు

ఈ కేసులో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

Representational Image (Photo Credits: File Image)

Basara, June 13: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ కేసులో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్జీయూకేటీ పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక.. A3 బ్లాక్‌లోని బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంసా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడగా.. అందులో దీపిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్‌ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

బెంగుళూరులో దారుణం, తల్లిని చంపి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన కూతురు

దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూంకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో లవ్, అతను ఫోన్ ఎత్తడం లేదని ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య, యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత

వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియాసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు.