Telangana Shocker: కొడుకు ఆత్మహత్య, కోడలిని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసిన మామ, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన
కోడలిని మామ అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి (Woman hacked to death by father in law) చంపేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది.
Mancherial, Jan 4: తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలిని మామ అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి (Woman hacked to death by father in law) చంపేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, కొత్తపల్లి ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం..కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన రాళ్లబండి సాయికృష్ణ, బోరగళ్ల సౌందర్య ప్రేమించుకున్నారు.
ఇద్దరు ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్ది కాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయి కృష్ణ 3 నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. అప్పటి నుంచి సౌందర్య అదే గ్రామంలో పుట్టింట్లో నివసిస్తోంది.
ఈ నేపథ్యంలో తన కుమారుడి మరణానికి కోడలే కారణమని సాయి కృష్ణ తండ్రి తిరుపతి కక్ష పెంచుకున్నాడు. తన కుమారుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవడం వల్ల గ్రామంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నానని సన్నిహితులతో చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో తమ కూతురికి ప్రాణహాని ఉందని గ్రహించిన సౌందర్య తల్లిదండ్రులు ఆమె ను వేరే గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంచారు. ఇటీవల సౌందర్య తల్లిదండ్రులను చూడడానికి రావడంతో హత్య చేసేందుకు తిరుపతి పథకం వేశాడు.
సోమవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లగా మంచంపై దుప్పటి కప్పుకుని తండ్రి లక్ష్మయ్య, సౌందర్య వేర్వేరుగా నిద్రిస్తున్నారు. సౌందర్య ఎక్కడుందో తెలియక మొదటగా తిరుపతి కత్తితో లక్ష్మయ్యపై దాడి చేశాడు. వెంటనే అతడు తేరుకుని కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న సౌందర్య(24) ప్రాణభయంతో బయటకు పరుగెత్తింది. అయితే తిరుపతి ఆమెను వెంబడించి మరీ అతి కిరాతకంగా గొంతుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సౌందర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి దాడిలో తీవ్ర గాయాలైన లక్ష్మయ్య చికిత్స పొందుతున్నాడు. నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి ని తమకు అప్పగించాలని, అప్పటివరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేయబోమని మృతురాలి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు.