Rajasthan Shocker: కామాంధులా లేక నరరూప రాక్షసులా, బాలిక శవంపై పడి సామూహిక అత్యాచారం, పోస్ట్‌‌మార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగులోకి, రాజస్థాన్‌ రాష్ట్రంలో బుండీలో దారుణ ఘటన
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bundi, Jan 4: వీళ్లు మనుషులు కాదు.. కామాంధుల రూపంలో ఉన్న నరరూప రాక్షసులు.. చనిపోయిన తరువాత కూడా స్త్రీలను వదలడం లేదు. తాజాగా రాజస్థాన్‌ రాష్ట్రంలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 16 ఏళ్ల బాలికను ముగ్గురు కిరాతకులు దారుణంగా అత్యాచారం (Accused continued to rape Bundi girl ) చేసి చంపేశారు. ఆ తరువాత శవంపై పడి మళ్లీ సామూహిక అత్యాచారం (rape Bundi girl even after her death) చేశారు.

బుండీ పోలీసుల కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక మేకలు మేపేందుకు వెళ్లి డిసెంబర్‌ 23న అదృశ్యమైంది . ఆ తర్వాత ఆమె బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై పడి ఉంది. ఈ మేరకు పోస్ట్‌‌మార్టంలో చాలా భయంకరమైన విషయాలు బయట పడ్డాయి . ఆ బాలిక పై ముగ్గురు వ్యక్తులు సాముహికంగా అత్యాచారం చేసి చంపేశారని నివేదిక పేర్కొంది. అంతేకాదు ఆ బాలిక ప్రతిఘటించటంతో గొంతు నులిమి చంపారని తెలిపింది. అయితే బాలిక చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం కొనసాగించారని, పైగా ఆమె ప్రైవేట్‌ భాగాల్లో 30కి పైగా గాయలయ్యాయని పోస్ట్‌ మార్టం నివేదిక వెల్లడించింది.

కామాంధుడికి యావజ్జీవ శిక్ష, కోపంతో జడ్జిపై చెప్పులు విసిరేసిన దోషి, ఒక్కసారిగా షాక్ తిన్న న్యాయమూర్తి, హజిరా బాలిక హత్యాచారం కేసులో నిందితుడు సుజిత్‌ సాకేత్‌ జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ తీర్పు

ఈ మేరకు బుండి ఎస్పీ జై యాదవ్ మాట్లాడుతూ..."నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరుఫున వాదించమని ప్రకటించారు" అని అన్నారు. డిసెంబరు 23న తప్పిపోయిన 16 ఏళ్ల బాలిక శవపరీక్ష నివేదిక రాజస్థాన్‌లోని బుండీలో అత్యాచారం మరియు హత్యకు గురైనట్లు తేలింది, ఆమె మరణించిన తర్వాత కూడా నిందితులు ఆమెపై అత్యాచారం కొనసాగించారని ఆయన తెలిపారు.