Telangana Shocker: డబ్బుల వ్యవహారం, మహిళను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసిన కిరాతకుడు, మొండెం లేని తల కేసులో పోలీసులు కీలక పురోగతి

తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.

Murder (Photo Credits: Pixabay)

HYd, May 24: మలక్‌పేట్‌ పరిధిలో తల లేని మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.

కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

ఆరు రోజుల క్రితం మలక్‌పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెంలేని తల కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును ఛేదించారు. మృతిరాలిని ఎర్రం అనురాధగా ధ్రువీకరించారు. ఆమె సోదరి, బావ గుర్తించడంతో పోలీసులు ఆ తల నర్సు అనురాధదేనని తేల్చారు.

ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన

ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహించేదని, డబ్బుల వ్యవహారంలోనే ఆమె హత్యకు గురైనట్లు నిర్థారణకు వచ్చారు. ఈ కేసులో హంతకుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనురాధను హత్య చేసిన తర్వాత నిందితుడు చికెన్‌ షాపులో ఉండే కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు, క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హత్య వ్యవహారం అంతా చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే జరిగినట్టు మలక్‌పేట పోలీసులు తేల్చారు. చంద్రమౌళిని హత్య జరిగిన చోటుకు తీసుకొచ్చిన పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.