Telangana Shocker: జులాయి తిరుగుడు..పెళ్లి చేయలేదని తండ్రిని కొడవలితో నరికి చంపేసిన శాడిస్ట్ కొడుకు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన
తనకు పెళ్లి చేయడం లేదని తండ్రిని గొంతు కోసి దారుణంగా హత్య ( Son killed his father) చేశాడు ఓ శాడిస్ట్ కొడుకు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది.
Hyd, June 13: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదని తండ్రిని గొంతు కోసి దారుణంగా హత్య ( Son killed his father) చేశాడు ఓ శాడిస్ట్ కొడుకు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి కథనం ప్రకారం.. పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి.. ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో ఉద్యోగం చేసి విరమణ పొందాడు.
ఇతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయమని (for not marrying) తండ్రితో ప్రతి రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య గొడవ జరిగింది. కోపాద్రికుడైన అన్వేష్ తండ్రి గణపతి మెడపై కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వామ్మో..అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు, దాంతో మన దేశంలో తులం బంగారం కొనొచ్చు
ఇక తాగుడుకు బానిసై నిత్యం భార్య, తల్లిని హింసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డిపల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (36)కి భార్య రజిత, తల్లి లక్ష్మి, పన్నెండేళ్లలోపు యుగంధర్‌రెడ్డి, గగన అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి తాగుడుకు బానిసైన రవీందర్‌రెడ్డి ప్రతిరోజు తాగి భార్యను, తల్లిని, పిల్లలను తిడుతూ, కొడుతూ హింసించేవాడు. పలుమార్లు పంచాయతీ పెట్టి మందలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.
శనివారం ఉదయం కూడా తాగిన మైకంలో తన తల్లిని, భార్యను తిట్టి కొట్టి గొడవపడ్డాడు. దీంతో అతని హింసలు భరించలేక తల్లి లక్ష్మి, భార్య రజిత ఇంట్లోని ఓ గదిలో రవీందర్‌రెడ్డిని గొంతు పిసికి హతమార్చారని మృతుడి మేనమామ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని సీఐ కమాలాకర్, సంపత్‌కుమార్ పరిశీలించారు. మృతుని మెడపై, కాలు వద్ద గాయాలున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.