Condoms (Pixabay)

శ‌ృంగారంలో సురక్షిత పద్ధతులు పాటించడానికి, అలాగే ఎయిడ్స్, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నివారించడానికి కండోమ్‌లను వాడాలని ప్రభుత్వాలే ప్రచారం చేస్తాయి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఇక పలు దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇస్తుంటాయి. బయట మార్కెట్లో ఇవి కొనుగోలు చేసినా బ్రాండ్ ను బట్టి గరిష్టంగా కండోమ్ ప్యాకెట్ ధర రూ.100 ఉండొచ్చు.

అయితే ఒక కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు పలికితే షాక్ అవ్వాల్సిందే కదా.. ఇది నిజం. వెనిజులాలో (Condoms in Venezuela) ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలకు చేరింది. ఈ ధరకు ఆ దేశంలో హై ఎండ్ బ్రాండెడ్ టీవీలను కొనుక్కోవచ్చు. అదే మన దేశంలో అయితే తులం బంగారం కొనొచ్చని సెటైర్లు వేస్తున్నారు. వెనిజులాలో ఈ రేంజ్‌లో కండోమ్‌ ధర (Condoms are more expensive) పెరగడానికి కారణం అక్కడి చట్టాలే. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. ఆ దేశంలో చట్టవిరుద్ధ అబార్షన్లు చేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. దీంతో జనాలు పెద్ద ఎత్తున కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. కండోమ్ లకు భారీ డిమాండ్ ఉండటంతో రేట్లను పెంచేశారు.

ఒకసారి వాడిన కండోమ్‌ను రెండోసారి కడిగి వాడుకోవచ్చా, నిపుణులు ఏం చెబుతున్నారు, ప్రతీ పురుషుడు తెలుసుకోవాల్సిన నిజం ఇదే..

ఐక్యరాజ్యసమితి వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2015 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా టీనేజ్ గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో అబార్షన్‌ చట్టాలను కఠినతరం చేశాయి. దీంతో పెద్దఎత్తున కండోమ్‌లకు డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. కండోమ్‌ ధరలు ఓ రేంజ్‌లో పెరగడంతో వెనిజులాలో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీనిపై స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. కండోమ్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.