కండోమ్‌లు.. అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సురక్షిత శృంగారానికి కండోమ్‌లకు మించిన మార్గం మరొకటి లేదు. ఈ నేపథ్యంలో కండోమ్ వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. కొన్ని కండోమ్‌ల వల్ల ఊహించని అలర్జీలు రావచ్చు. ఇందుకు ఓ వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవమే నిదర్శనం. అంతేకాదు ఒక్కసారి వాడిన కండోమ్ రెండోసారి వాడేందుకు పనికిరాదు.
ఒకసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత వెంటనే ఆ కండోమ్ ను బయట పడేయాలి. ఒకే కండోమ్‌ను మళ్లీ మళ్లీ వాడటం ప్రమాదకరం కూడా. అలాగే, కండోమ్‌ను అంగం స్తంభించిన తర్వాతే తొడగాలి. లేకపోతే.. అది అంగానికి సరిగ్గా పట్టదు. వదులుగా ఉండే కండోమ్.. ఒక్కోసారి స్త్రీల జననాంగంలోకి జారుకుంటుంది. వాడిన కండోమ్‌ను మళ్లీ వాడితే.. వద్దనుకున్నా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే దానిపై ఉండే జిగురు వంటి లూబ్రికెంట్ సైతం పూర్తిగా తొలగిపోయి.. తీవ్రమైన రాపిడి ఏర్పడి ఇరువురికి గాయాలు కావచ్చు.