Representational Image | (Photo Credits: IANS)

Lucknow, Dec 15: హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి రూ.5,000 ఇచ్చేందుకు నిరాకరించిందని ఆమె గొంతు పిసికి చంపేశాడు కొన్న కొడుకు. ఆ తర్వాత ట్రావెల్‌ బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అలెర్ట్‌ చేయడంతో దొరికిపోయాడు. హర్యానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన హిమాన్షు, హర్యానాలోని హిసార్‌లో పనిచేస్తున్నాడు. ఐఐటీకి ప్రిపేర్‌ అవుతున్న అతడి వద్దనే తల్లి ప్రతిమా దేవి ఉంటున్నది.

తనకు రూ.5,000 ఇవ్వాలని తల్లిని హిమాన్షు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించి గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో గొంతు నొక్కి తల్లి ప్రతిమా దేవిని హత్య చేశాడు. తల్లిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పడేసేందుకు కుమారుడు హిమాన్షు ప్రయత్నించాడు. ట్రావెల్‌ బ్యాగ్‌లో ఆమె మృతదేహాన్ని కుక్కి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు దానితో ప్రయాణించాడు. తల్లి మృతదేహం ఉన్న ట్రావెల్‌ బ్యాగ్‌ను త్రివేణి సంగమం వద్ద నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు.

వీడియో ఇదిగో, నోయిడాలో దారుణం, దొంగతనం చేశారని ఇద్దరు యువకుల ప్రైవేట్ పార్టులో కారం పోసి చిత్రహింసలకు గురిచేసిన కొందరు యువకులు

మరోవైపు త్రివేణి సంగమం వద్ద హిమాన్షు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హిమాన్షు వద్ద ఉన్న ట్రావెల్‌ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో మహిళ మృతదేహం ఉండటం చూసి షాక్‌ అయ్యారు. మృతురాలు హిమాన్షు తల్లిగా తెలుసుకున్నారు. డబ్బుల విషయంలో గొడవ జరుగడంతో ఆమెను హత్య చేసినట్లు అతడు చెప్పాడు. హిమాన్సును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.