Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.

Telangana Special Assembly sessions likely to be held for 5 days!(X)

Hyd, Feb 20:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత మార్చి 10 వ తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుంది.

మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశం జరుగనుండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి(Telangana Assembly) వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. మార్చి 31వ తేదీలోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.

మిస్‌ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్‌, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను రూపొందించే పనిలో ఉంది. ఎస్సీ ఉప వర్గీకరణకు(Telangana Assembly) చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై ఒక బిల్లు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా మరో బిల్లు.. ఇలా మూడు బిల్లులను ప్రభుత్వం సిద్దం చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది బీఆర్ఎస్. రైతు, గురుకులాల సమస్యలతో పాటు కులగణన తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement