Srisailam Power Plant Fire: పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీం, ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇంకా అదుపులోకి రాని పొగ, ఆరు యూనిట్లలోని ప్యానెల్స్ దగ్ధం
మూడు ఫైరింజన్లు, మూడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్‌కో (GENCO) ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని (Srisailam Power Plant) నిలిపివేశారు.
Srisailam, August 21: శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో (Srisailam Power Plant Fire) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు ఫైరింజన్లు, మూడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్‌కో (GENCO) ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని (Srisailam Power Plant) నిలిపివేశారు.
శుక్రవారం ఉదయం కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Team) మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్‌ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కమ్మేసిన పొగ..పనిచేయని ఫోన్లు, ప్లాంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన రెస్కూ టీం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్
విద్యుత్ కేంద్రంలోకి విడతల వారీగా ఫైరింజన్, అంబులెన్స్ సిబ్బంది వెళ్తున్నారు. విద్యుత్ కేంద్రంలో అలుముకున్న పొగను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తోంది. విద్యుత్‌ను పునరుద్ధరిస్తే తొమ్మిది మంది ఎక్కడున్నారన్న విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించే ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. విద్యుత్ కేంద్రంలోకి మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్ కలెక్టర్, అధికారుల బృందం వెళ్లారు.
ప్రమాద స్థలంలో హైవోల్టేజ్ టార్చ్‌లు వేసినప్పటికీ పొగ వల్ల పది అడుగుల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 44వ ఫైర్ క్యాబిన్ వద్ద ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఓ వైపు మంటలు ఆర్పుతుంటే... మరోవైపు దట్టమైన పొగ అలుముకుంటోంది. దీంతో పొగ ఎక్కడ నుంచి వస్తుంది అనేది ఫైర్ సిబ్బంది అంచనా వేయలేకపోతున్నారు. అగ్నిప్రమాదంలో ఆరు యూనిట్లలోని ప్యానెల్స్ దగ్ధమయ్యాయి. చిత్తూరు పాల డెయిరీలో గ్యాస్ లీకేజి, 14 మందికి అస్వస్థత, అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఘటన, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మున్సిపల్, ఐటీ వ్యవహారాలశాఖ మంత్రి కేటీఆర్ కాసేపట్లో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
గురువారం రాత్రి శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. ప్రమాద సమయంలో విధుల్లో 30 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సొరంగ మార్గం నుంచి 15 మంది బయటపడ్డారు. పొగలు కమ్మకోవడంతో ప్రమాదంలో 9 మంది సిబ్బంది చిక్కకున్నారు.
మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్