Stray Dog Attack: అంబర్ పేట ఘటన మరువక ముందే మరో ఘటన, రోడ్డుపై పోతున్న వారిని ఇష్టమొచ్చినట్లుగా కరుచుకుంటూ పోయిన వీధి కుక్క, 10 మందికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఓ వీధి కుక్క మనుషులపై దాడికి పాల్పడింది. ఏకంగా పది మందిని (Stray dog bites 10 persons) తీవ్రంగా గాయపరిచింది.

Representational Image (Photo Credits: Pixabay)

Hyd, Feb 23: అంబర్ పేట వీధి కుక్కల దాడి ఘటన మరువక ముందే మరో ఘటన (Stray Dog Attack) చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఓ వీధి కుక్క మనుషులపై దాడికి పాల్పడింది. ఏకంగా పది మందిని (Stray dog bites 10 persons) తీవ్రంగా గాయపరిచింది. మండల కేంద్రంలో సాగర్ రహదారిపై వివిధ పనుల నిమిత్తం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎల్లమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఉన్నారు.

అనుకోకుండా ఓ పిచ్చి కుక్క అటుగా వచ్చి దొరికిన వారిని దొరికినట్టు కరుచుకుంటూ పోయింది. పిచ్చికుక్క కాటుకు పదిమంది తీవ్ర గాయాల పాలయ్యారు.వీరందరినీ స్థానికుల సహాయంతో యాచారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రియాంక, డాక్టర్ లలితలు వారికి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని రెండు 108 అంబులెన్స్ వాహనాలలో నారాయణగూడ ఆస్పత్రికి తరలించారు.

వీధి కుక్కల దాడిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్, నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ, జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడిన హైకోర్టు

ఎంపీపీ సుకన్య, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారాణి బాధితులను పరామర్శించి వారిని ఆస్ప్రతికు తరలించడంలో సహాయపడ్డారు. గ్రామాలలో వీధి కుక్కలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఎంపీపీ సుకన్య తెలిపారు.