Telangana: సిద్దిపేట అదనపు కలెక్టర్‌పై కుక్కల దాడి, వాకింగ్‌ చేస్తున్న సమయంలో పిక్కలను పట్టేసుకున్న వీధి కుక్కలు, కలెక్టర్‌ పెంపుడు కుక్కపైనా దాడి

తాజాగా సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్కల బారిన పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్‌ క్వార్టర్స్‌ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోలేదు.

(Photo Credits: Dog Lovers Foundation/Facebook)

Hyd, April 4: తెలంగాణలో కుక్కల బెడద తగ్గడం లేదు. తాజాగా సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్కల బారిన పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్‌ క్వార్టర్స్‌ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్‌నే కరవడంతో రంగంలోకి దిగారు.

శనివారం రాత్రి సమయంలో క్వార్టర్స్‌ వద్ద వాకింగ్‌ చేస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌ రెడ్డిపై వీధికుక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్‌ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెప్తున్నారు.

కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని విమర్శిస్తున్నారు స్థానికులు.