Telangana Student Dies in US: ఎంఎస్ చదువు కోసం అమెరికాకు, ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్, బుల్లెట్ తగిలి మృతి చెందిన ఖమ్మం జిల్లా యువకుడు

అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా విద్యార్థి సోమవారం మృతి (Telangana Student Dies in US) చెందాడు.ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (Mahankali Akhil Sai) ఎంఎస్‌ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికాలోని అలబామాకు వెళ్లాడు.

Representational Image (File Photo)

Alabama, Feb 7: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా విద్యార్థి సోమవారం మృతి (Telangana Student Dies in US) చెందాడు.ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (Mahankali Akhil Sai) ఎంఎస్‌ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికాలోని అలబామాకు వెళ్లాడు. అక్కడ అబర్న్‌ యూనివర్సిటీ సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యతో చిన్న గొడవ, ఆమె చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి దూకేసిన భర్త, తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భార్య

అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌ స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డ్ త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని ప‌రిశీలిస్తున్న క్ర‌మంలో.. ఆ తుపాకీ మిస్ ఫైర్ అయ్యి అఖిల్‌సాయి తలలోకి నేరుగా బుల్లెట్ దూసుకెళ్లింది. త‌ల‌లోకి బుల్లెట్ దూసుకెళ్ల‌డంతో అత‌డిని వెంట‌నే ఆస్పత్రికు త‌ర‌లించారు. త‌ల‌కు తీవ్ర గాయం కావ‌డంతో చికిత్స పోందుతూ అఖిల్‌ మృతిచెందాడు. కాగా విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.