Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు(temperatures dip)పడిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటూ ఇదే రేంజ్‌లో చలి తీవ్రత కొనసాగే అవకాశముంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది ఐఎండీ.

Winter Season - Representational Image | Photo: IANS

Hyderabad December 19: తెలంగాణ(Telangana)లో చలి పంజా(cold wave) విసురుతోంది. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు(temperatures dip)పడిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటూ ఇదే రేంజ్‌లో చలి తీవ్రత కొనసాగే అవకాశముంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది ఐఎండీ.

సాధారణంగా చలికాలంలో చలి తీవ్రత ఎక్కడైనా ఉంటుంది. కానీ.. ఎక్కడా లేనివిధంగా ఈసారి హైదరాబాద్‌లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం తెల్లవారుజామున పటాన్‌చెరు ప్రాంతంలో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. గతంతో డిసెంబర్ 13, 2015న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. అప్పట్లో అదే అత్యల్పం.

North India Cold Wave: చలి దెబ్బకు వణుకుతున్న ఉత్తర భారతం, చలి గుప్పిట్లో చిక్కుకుపోయిన దేశ రాజధాని ఢిల్లీ, పొగమంచుతో ప్రమాదాలు, పొగమంచుకు తోడవుతున్న వాయు కాలుష్యం

సిటీలో ఓవరాల్‌గా మినిమమ్ 12.5 డిగ్రీ సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. మరో నాలుగు అయిదు రోజుల వరకు ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

రాష్ట్రం‌లోని ప‌లు ప్రాంతాల్లో 10 డిగ్రీల‌ లోపే ఉష్ణోగ్రత న‌మోదు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. సంగారెడ్డిలో అత్యల్పంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పదేళ్ల అత్యల్పమని అధికారులు తెలిపారు. దీంతో వాతావ‌ర‌ణ శాఖ డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు నగ‌ర వ్యాప్తంగా ఎల్లో అల‌ర్ట్ ప్రక‌టించింది. ఇక ఆదిలాబాద్, రాజ‌న్న సిరిసిల్ల, జ‌గిత్యాల‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల‌కు వ‌చ్చే కొన్ని రోజుల వ‌ర‌కు ఆరెంజ్ వార్నింగ్‌ను వాతావార‌ణ శాఖ జారీ చేసింది.