Teppalamadugu Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యం..తెలంగాణలో సర్పంచ్ కుటుంబం మొత్తం దుర్మరణం, నిడమనూరులో ఘోర రోడ్డు ప్రమాదం, పరారీలో లారీ డ్రైవర్

ఒక్క శుక్రవారం రోజే ఉమ్మడి జిల్లాలో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం మొత్తం చనిపోయింది. తెలంగాణ నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Teppalamadugu Road Accident) తెప్పలమడుగు సర్పంచ్ కుటుంబం మృత్యువాత పడింది.

Road accident (image use for representational)

Hyderabad, April 3: నల్గొండ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్క శుక్రవారం రోజే ఉమ్మడి జిల్లాలో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం మొత్తం చనిపోయింది. తెలంగాణ నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Teppalamadugu Road Accident) తెప్పలమడుగు సర్పంచ్ కుటుంబం మృత్యువాత పడింది.

పోలీసుల కథనం ప్రకారం.. బియ్యం లోడుతో మిర్యాలగూడ నుంచి వస్తున్న లారీ నిడమనూరు వద్ద అదుపుతప్పి ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆ వాహనం పక్కకు ఒరిగింది. ఆ వేగానికి వెనకే వస్తున్న బైక్‌పైకి టాటా ఏస్ దూసుకెళ్లింది.

దీంతో బైక్‌పై ఉన్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఐదేళ్ల వారి కుమార్తె శ్రీవిద్య, మూడేళ్ల కుమారుడు కన్నయ్య, టాటా ఏస్‌లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ, సర్పంచ్ పిల్లలు ఇద్దరూ మృతి చెందారు.

ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన, ప్రమాదంలో సగం వరకు కాలిపోయిన ఇంద్ర బస్, బస్సులో ఉన్న 15 మంది సేఫ్

తన భార్య విజయ పుట్టింట్లో శుభకార్యం ఉండడంతో ముప్పరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.