Telangana Viral News: చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!

అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే.

Tree decorated with Dress

Hyderabad, July 30: భార్యాభర్తల (Wife-Husband) బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే. చనిపోయిన భర్త జ్ఞాపకాలను ఓ చెట్టులో (Tree) చూసుకుంటూ ఏటా జయంతి చేస్తున్నారు వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి. సోమవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు చనిపోయిన తన భర్త డ్రెస్‌ వేసి, కొమ్మలకు బెలూన్లు కట్టి, అందంగా అలంకరించి వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు, భర్తకు జయంతిని నిర్వహించారు ఆమె.

కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం

అసలేం జరిగిందంటే?

ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త వెంకటయ్య జబ్బు పడ్డారు. కోలుకోవడం కష్టమని గ్రహించిన ఆయన  తన ఇంటి ఎదుట మొక్క నాటారు. మొక్క నాటిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించారు. అయితే, భర్త మరణానంతరం విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆ మొక్క ఇప్పుడు చెట్టయ్యింది. ఏటా కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు బెలూన్స్‌ కట్టి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నారు ఆమె. అయితే, ఇంతలోనే ఆమె ఊహించని పరిస్థితి ఎదురైంది.

జార్ఖండ్‌ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు

చెట్టును వేరేచోటుకి తరలించి..

నేషనల్‌ హైవే వెడల్పులో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందున్న చెట్టును తొలగించాలని అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆ చెట్టు వెనుక కథను ఆమె అధికారులకు వివరించారు. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న అధికారులు చెట్టు చనిపోకుండా జాగ్రత్తగా తరలించడానికి ఒప్పుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో, అధికారుల సహకారంతో ఆ చెట్టును జేసీబీ సహాయంతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోకి తీసుకెళ్లి నాటారు ఆమె. దీంతో ఆ చెట్టుకు పూజలు చేసి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుక నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

US Elections Results 2024: ట్రంప్ 2.0 భారత్-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, వైట్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ట్రంప్‌తో భారత్‌కు మేలు చేకూరేనా..?

US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు

2024 US Elections Results: దూసుకుపోతున్న ట్రంప్, మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం సొంతం, రెండు యుద్దభూముల్లో జెండా పాతిన రిపబ్లికన్ పార్టీ