Telangana Tragedy: వనపర్తి జిల్లాలో ఘోర విషాదం, బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతి, విచారం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
Wanaparthy, May 8: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని శ్రీరంగాపురం మండలం తాతిపాములలో వీరసముద్రం చెరువు(Pond)లో బట్టలు ఉతకడానికి వెళ్లి గంధం కురుమన్న ముగ్గురు కుమార్తెలు గంధం తిరుపతమ్మ (16) గంధం సంధ్య (12) గంధం దీపిక (10)లు పడి మరణించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికి వారి మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
జరిగిన ఘటనను తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా(Government) ఆదుకునేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.