IPL Auction 2025 Live

Telangana: తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ కోరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సైని దూషించిన విషయంలో మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదు

మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి (TRS MLC Patnam Mahender Reddy) తెలిపారు.

Patnam Mahender Reddy And Tandur CI (Photo-File Image)

Hyd, April 28: తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ వైరల్‌ అవడంతో.. మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి (TRS MLC Patnam Mahender Reddy) తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు.తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో సీఐను (Tandur Circle Inspector) కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను.రు. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అని గురువారం ఓప్రకటనలో తెలిపారు.

కాగా ‘రౌడీషీటర్లకు కార్పెట్‌ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్‌ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్‌ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు.

రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసుక అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నానని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్‌ కట్‌ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్‌ ఎస్పీ తెలిపారు. . ఈ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక, నేడు రేపు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని సూచన, భానుడు చండ్ర నిప్పులు చెరుగుతాడని తెలిపిన ఐఎండీ

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో యాలాల ఎస్సైపై మహేందర్‌ రెడ్డిపై నోరు జారినందుకు ఈ కేసుపెట్టారు. సీఐని దూషిస్తూ. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. కాగా ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని ఎస్సై అరవింద్‌ ఆరోపించారు. తీవ్ర పరుష పదజాలాన్ని వాడారని, తనకు నచ్చని వాళ్లను స్టేజి పైనుంచి కిందకు దించాలంటూ బూతులు తిట్టారని అన్నారు. అరేయ్‌ ఎస్సై.. తమాషాలు చేస్తున్నావా అని తిట్టాడని. పబ్లిక్‌లో తిట్టడం అవమానకరంగా ఉందన్నారు. మహేందర్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.



సంబంధిత వార్తలు

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే