తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. ఈ రెండు రోజుల్లో భానుడు (Sun) చండ్ర నిప్పులు చెరగనున్నాడని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని (Day temperatures on rise in Telangana) సూచించింది.

ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. అలాగే, మరో పది జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆయా జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, భానుడి ప్రతాపం నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)