Telangana: రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, 22 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన యువకుడు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు

తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి (TSMSIDC MD Chandrasekhar Reddy) కుమారుడు అభిజిత్‌ రెడ్డి (22) నిన్న అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

Representational Image (Photo Credits: Twitter)

Hyd, Sep 27: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఓ యువకుడు 22 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడు. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి (TSMSIDC MD Chandrasekhar Reddy) కుమారుడు అభిజిత్‌ రెడ్డి (22) నిన్న అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్‌కు (abhijith reddy ) గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏం చేశారో తెలుసా, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలనే వాడేశారు

వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు (Heart Stroke at 22 Years) తెలిపారు.కాగా, కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభిజిత్‌ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ ఆయిల్‌ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్‌ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం