Telangana: బస్సులు ఆపడం లేంటూ సజ్జనార్‌ని ట్యాగ్ చేస్తూ యువతి ట్వీట్, వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ, క్షమాపణలు తెలిపిన ఆర్టీసీ
రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెస్సాండ్ అయ్యారు.
రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెస్సాండ్ అయ్యారు. ట్విట్టర్లో నందిని అనే యువతి దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుంచి 10:02 వరకు పటాన్‌చెరు ఆల్విన్ బస్టాప్‌లో ఒక్క బస్సు కూడా ఆపలేదు. చేయి చూపించిన కూడా ఆపలేదు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది, ఆర్టీసీ అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. స్టాప్‌లలో కాకుండా ఇంకెక్కడ ఆపుతారు. దయచేసి అవసరమైనవి చేయండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంజీ సజ్జనార్, టీఎస్‌ఆర్టీసీ ట్విటర్‌లను ట్యాగ్ చేశారు.
యువతి చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సంబంధిత అధికారులు దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ టీఆఎస్‌ఆర్టీసీ ట్విటర్‌ను ట్యాగ్ చేశారు. సజ్జనార్ ఆదేశాలపై స్పందిస్తూ. యువతికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ. . తమ డ్రైవర్లు, కండక్టర్లకు అల్విన్ బస్ స్టాప్ వద్ద బస్సులను ఆపమని అవగాహన కల్పిస్తామని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.