Hyd Road Accident: చర్లపల్లి జైలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఇద్దర విద్యార్థులు మృతి, మరో నలుగురికి గాయాలు

చర్లపల్లి జైలు సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Accident Representative image (Image: File Pic)

Hyd, Sep 8: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి జైలు సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో ఆరుమంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో విషాదం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు పాఠశాల విద్యార్థినులు ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.